సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పై దుకాణాలకు నోటీసులు

by Batti.Sumithra |

మండల కేంద్రం ముథోల్‌లోని దుకాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచిస్తూ గ్రామపంచాయతీ ఈవో అన్వర్ అలీ అన్నారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పై దుకాణాలకు నోటీసులు
X

దిశ, ముధోల్ : మండల కేంద్రం ముథోల్‌లోని దుకాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచిస్తూ గ్రామపంచాయతీ ఈవో అన్వర్ అలీ అన్నారు. దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం, నిల్వ, విక్రయం, పంపిణీ పూర్తిగా నిషేధించబడిందని తెలిపారు. దుకాణాల్లో తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి, పర్యావరణానికి హాని కలగకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని సూచించారు. నిబంధనలను తక్షణమే అమలు చేయాలని, వాటిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతి దుకాణదారు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన కోరారు.

Next Story