- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులపై పడ్డ ప్రతి లాఠీ దెబ్బకు బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు: పొంగులేటి
ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్‌ను మంత్రి పొంగులేటి ఖండించారు. ఇదేనా మోడీ అచ్చేదిన్ అంటే అని ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యువతపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై పడ్డ ప్రతి లాఠీ దెబ్బకు, చిందిన ప్రతి రక్తపు బొట్టుకూ బీజేపీ పార్టీ ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనపై, పేపర్ లీకులపై శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై కాషాయ కసాయి పాలకులు చేసిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. భావి భారతాన్ని తీర్చిదిద్దే యువతపై లాఠీలు ప్రయోగించడం మోడీ ప్రభుత్వ అహంకారానికి, నియంతృత్వ ధోరణికి నిదర్శనం అన్నారు. బీజేపీ అసమర్థ పాలనపై పోరాడుతున్న యువతపై లాఠీచార్జ్ చేయడం, పేపర్ లీకులతో విసిగిపోయి, తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను శత్రువుల్లా చూస్తూ, బూటుకాళ్ల కింద తొక్కిపడేయడం ఇదేనా మోడీ గారు మీ ‘అచ్చే దిన్’? అని ప్రశ్నించారు. తమ న్యాయమైన హక్కుల కోసం, భవిష్యత్తు కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతకు, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. యువత పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది.






