‘SIR’లో మీ పేరు నమోదు అయిందా?.. ఒక్క SMSతో వెంటనే తెలుసుకోండి!

by Gantepaka Srikanth |   (  Updated:2026-07-21 11:16:19  IST  )

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

‘SIR’లో మీ పేరు నమోదు అయిందా?.. ఒక్క SMSతో వెంటనే తెలుసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో బీఎల్‌వో (BLO) ద్వారా తమ వివరాలు విజయవంతంగా నమోదయ్యాయో లేదో అని సందేహపడుతున్న ఓటర్లకు ఎన్నికల కమిషన్ అత్యంత సులువైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ లేదా స్మార్ట్‌ఫోన్ లేకపోయినా, ఇంట్లో నుంచే సాధారణ మొబైల్ ద్వారా ఒక్క SMS పంపి తమ వివరాలను సరిచూసుకోవచ్చు.

SMS ద్వారా స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?

మీ మొబైల్ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి ECI <ఖాళీ> EPIC Number (ఓటరు కార్డ్ నంబర్) అని టైప్ చేయాలి (ఉదాహరణకు: ECI UTQ0777245). ఈ మెసేజ్‌ను 1950 నంబర్‌కు పంపాలి. సందేశం పంపిన కొద్దిసేపటికే ఎన్నికల కమిషన్ నుంచి మీ ఓటరు వివరాలతో రిప్లై మెసేజ్ వస్తుంది. వివరాలు వస్తే మీ పేరు SIR ప్రక్రియలో నమోదు అయినట్లే. రాకపోతే ప్రాసెస్ పెండింగ్‌లో ఉండటం లేదా? సరిగా నమోదు కాలేదని భావించాలి. ECI, EPIC నంబర్ మధ్య తప్పనిసరిగా స్పేస్ (Space) ఉండాలి. ఒకవేళ మెసేజ్ రాకపోతే నెట్వర్క్ ఆలస్యం కావచ్చు లేదా నమోదు ప్రక్రియ పెండింగ్‌లో ఉండవచ్చు. వెంటనే ఆందోళన చెందకుండా మీ ప్రాంత BLOని సంప్రదించి వివరాలు నిర్ధారించుకోవాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ వెంటనే 1950 నంబరు SMS పంపి, తమ ఓటు హక్కు నమోదు స్థితిని సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story