- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల లాఠీచార్జిపై సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ఆగ్రహం!
ఢిల్లీ పోలీసుల లాఠీచార్జిపై సీజేపీ నేత అశుతోష్ రాంకా ఆగ్రహం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసనలు ఆపేదే లేదని స్పష్టీకరణ!

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన 'చలో పార్లమెంట్' మార్చ్‌పై పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారని కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు శాంతియుత నిరసనకారులపై లాఠీచార్జి చేసి, రోడ్లపై ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జుట్టు పట్టుకుని ట్రక్కు నుంచి బయటకు లాగారని, అలాగే తమ వాలంటీర్లలో ఒకరి పక్కటెముకలు విరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులను దెబ్బతీయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు అందాయని, అయితే ఈ దాడితో తమ ఉద్యమం ఆగదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
సోమవారం ప్రభుత్వం తరఫున జరిగిన సంప్రదింపుల గురించి మాట్లాడుతూ, ప్రభుత్వంతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ దాదాపు 5 గంటల సమయం వృథా అయిందని, ఎలాంటి సానుకూల స్పందన రాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తమతో మాట్లాడాలనుకుంటే నేరుగా నిరసన స్థలానికే వచ్చి మాట్లాడాలని, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు, నిరసన ప్రదర్శనలో బాలికపై దాడి జరిగిందన్న వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించినప్పటికీ, సీజేపీ నేతలు మాత్రం పోలీసుల తీవ్ర దౌర్జన్యాలపై మండిపడుతుండటంతో జంతర్ మంతర్ పరిసరాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.






