- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పదంగా సంచరిస్తూ పట్టుబడ్డ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణకు హైదరాబాద్ సిటీ పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా నమోదు చేసిన ఈ-పెట్టీ కేసులో నిందితుడికి కోర్టు మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.

దిశ, చంపాపేట్: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణకు హైదరాబాద్ సిటీ పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా నమోదు చేసిన ఈ-పెట్టీ కేసులో నిందితుడికి కోర్టు మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో గౌరవ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. పోలీసుల వివరాల ప్రకారం, బాలాపూర్‌లోని షహీన్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఖలీల్ (28) అనే వ్యక్తి నేరానికి పాల్పడే ఉద్దేశంతో అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గుర్తించిన చాదర్‌ఘాట్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 61(బి) కింద ఈ-పెట్టీ కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసును విచారించిన హైదరాబాద్ VI స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎం. భాస్కర్ కేసులోని ఆధారాలను పరిశీలించి నిందితుడికి మూడు రోజుల సాధారణ జైలు శిక్ష (సింపిల్ ఇంప్రిసన్మెంట్ ) విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసు దర్యాప్తును చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ సురేష్ రెడ్డి నిర్వహించగా, కోర్టు విచారణలో సీడీవో జి. సాయినాథ్ (పీసీ-1586) సమర్థంగా వాదనలు వినిపించి కేసు విజయవంతమైన తీర్పుకు సహకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీసులు మాట్లాడుతూ, ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా లేదా నేరాలకు పాల్పడే ఉద్దేశంతో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నగరంలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.






