ఢిల్లీ విధ్వంసంపై కేసు నమోదు: కానాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్‌లలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు!

by Malleboina Mahesh |

ఢిల్లీ సీజేపీ ఆందోళన తీవ్ర హింసాత్మకంగా మారడంతో కానాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్లలో నిరసన కారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు!

ఢిల్లీ విధ్వంసంపై కేసు నమోదు: కానాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్‌లలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు!
X

దిశ, వెబ్ డెస్క్: కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన 'చలో పార్లమెంట్' ఢిల్లీలోని జంతర్ మంతర్, పార్లమెంట్ వీధి పరిసరాల్లో ఆందోళన తీవ్ర హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు మంగళవారం కఠిన చర్యలు చేపట్టారు. నిరసనకారులు బారికేడ్లు తోసుకుంటూ వచ్చి రాళ్ల దాడికి పాల్పడటం, ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడం, పోలీసుల హెల్మెట్, జాకెట్లు లాక్కోవడం వంటి చర్యలపై కానాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లలో భారతీయ నస్య సంహిత (BNS) లోని వివిధ తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లు (FIR) నమోదు చేశారు. ఈ అల్లర్లలో స్పెషల్ కమిషనర్ స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారితో సహా 118 మందికి పైగా పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని, 60 మంది నిరసనకారులు గాయపడగా, హింసకు పాల్పడిన 70 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు పదేపదే హెచ్చరించినా వినకుండా, నిరోధాజ్ఞలను ఉల్లంఘించి ఆందోళనకారులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ప్రకటన విడుదల చేస్తూ.. కానాట్ ప్లేస్ వద్ద రాళ్లదాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను కూడా పోలీసులు విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న తప్పుడు ప్రచారాలు, అసత్య కథనాలను ఎవరూ నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించి నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని ఢిల్లీ పోలీస్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ, డిజిటల్ ఆధారాల సహాయంతో అల్లర్లకు కారణమైన వారిపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story