- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కబ్జాలో ఉన్న బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం : తహశీల్దార్ మునీరుద్దీన్
కబ్జాలో ఉన్న బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ మునీరుద్దీన్ తెలిపారు.

దిశ, మోమిన్ పేట్ : కబ్జాలో ఉన్న బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ మునీరుద్దీన్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని టేకులపల్లి గ్రామంను ఆయన సందర్శించి పరిశీలించారు. గత 50 సంవత్సరాల నుండి సర్వేనెంబర్ 437, 438, 4:40 నంబర్లలో సుమారు 50 మంది కబ్జాలో ఉన్నారు. గత 50 సంవత్సరాల క్రితం పట్టాదారు వద్ద కొనుగోలు చేశారు. అయినప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు పట్టాదారుల పేర్లమీదనే ఆన్లైన్లో ఉండటం వల్ల, వారి వారసులు కబ్జాలో ఉన్న వారిని బెదిరించి డబ్బులు కావాలని మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారని బాధితులు తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్లారు.
అందుకు తహశీల్దార్ కబ్జాలో ఉన్న బాధితులు వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడం వల్ల పట్టాదారులకు రైతుబంధు గాని ఎలాంటి రావు కాబట్టి బాధితులకు ఆ భూమిపైన హక్కు ఉంటుందని, అందుకోసం బాధ్యులకు న్యాయం చేసేందుకు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా పంచనామా నిర్వహించి, సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుండి అర్హులైన పేదప్రజలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మీకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. గ్రామంలో సమస్యలు తలెత్తకుండా గ్రామస్తుల సమక్షంలో శాంతి యుతంగా సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ భాస్కర్, జీపీఏ శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ చారి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమార్, నరేందర్ గౌడ్, ఫయాజ్, రహమత్ అలీ, మాణిక్యం, కబ్జాలో ఉన్న బాధితులు తదితరులు పాల్గొన్నారు.






