పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది

by Ratna Kumari |

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది
X

దిశ, నిజాంసాగర్ : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బంజేపల్లి, అచ్చంపేట, వడ్డేపల్లి, మల్లూరు, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్‌తో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించడమే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థకాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ కుటుంబం కూడా వివాహాల విషయంలో ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు బొజ్జ అంజయ్య, ఉప సర్పంచ్ అనీస్ పటేల్, తహసీల్దార్ సాయి భుజంగరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మహేష్ చంద్ర, జీపీఓలు సంగమేశ్వర్ రెడ్డి, శేఖర్, పార్టీ నాయకులు రాజారాం, గాండ్ల రమేష్, కోయల్కర్ మౌలాజీ, కోట కిషోర్ కుమార్, నెల్లి కృష్ణమూర్తి, ఊరటి వెంకట్, అయిటీ రాజు, బుడిమి శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ జమీల్, అబ్దుల్ సమద్, చిరంజీవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story