రాష్ట్రంలో పెరిగిన పట్టణ నిరుద్యోగం.. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడి

by Vemula.Srinu Prasad |

ఏపీలో పట్టణ నిరుద్యోగ శాతం పెరిగినట్లు పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు ఇచ్చిన తాజా సమాధానంలో వెల్లడించిన ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) వివరాల ప్రకారం గత రెండేళ్లలో, రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గకపోగా, కొన్ని విభాగాల్లో మరింత పెరిగినట్లు తేల్చి చెప్పాయి. ..

రాష్ట్రంలో పెరిగిన పట్టణ నిరుద్యోగం.. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడి
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో పట్టణ నిరుద్యోగ శాతం పెరిగినట్లు పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు ఇచ్చిన తాజా సమాధానంలో వెల్లడించిన ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) వివరాల ప్రకారం గత రెండేళ్లలో, రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గకపోగా, కొన్ని విభాగాల్లో మరింత పెరిగినట్లు తేల్చి చెప్పాయి. 2023–24లో నిరుద్యోగిత రేటు 4.1 శాతంగా ఉండగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదలైన తొలి వార్షిక ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదికలో చూస్తే, అది 4.2 శాతానికి పెరిగింది.

ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం మరింత ఆందోళనకరంగా మారింది. 2023–24లో పట్టణ నిరుద్యోగిత రేటు 5.9 శాతంగా ఉండగా, టీడీపీ కూటమి పాలనలో అది 6.2 శాతానికి పెరిగింది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటులో మాత్రం మార్పు రాలేదు. 3.4 శాతం వద్ద యథాతథంగా కొనసాగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనలో మెరుగైన పరిస్థితులు రాకపోగా, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారింది. ఇంకా రాష్ట్రంలో 15–29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువతలో నిరుద్యోగిత రేటు ఏకంగా 16.2 శాతంగా నమోదైనట్లు ఆ నివేదిక వెల్లడించింది.

Next Story