ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఈ సర్వీస్ రిజిస్టర్ అమలు

by Vemula.Srinu Prasad |

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్‌లో డిజిటల్ విధానం అమల్లోకి వచ్చింది. పాత భౌతిక రికార్డుల స్థానంలో ఈ సర్వీస్ రిజిస్టర్ విధానానికి శ్రీకారం చుట్టారు...

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఈ సర్వీస్ రిజిస్టర్ అమలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్‌లో డిజిటల్ విధానం అమల్లోకి వచ్చింది. పాత భౌతిక రికార్డుల స్థానంలో ఈ సర్వీస్ రిజిస్టర్ విధానానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల వివరాలు, సెలవులు, ఇతర రికార్డులు ఆన్ లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఉద్యోగుల పాత ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్‌ను స్కాన్ చేయనున్నారు. అందులోని వివరాలను e-SR 2.0 పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఉద్యోగులు, డిడిఓ (DDO), చెకర్, హెచ్‌ఆర్ మేనేజర్ (HR Manager) స్థాయిల్లో వివరాలు పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఆమోదించనున్నారు. ఈ సర్వీసులకు సంబంధించిన వివరాలను, డాక్యుమెంట్లను ఏపీఈఎస్సార్ (AP e-SR) పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు.

అయితే తొలి దశగా సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో సోమవారం(ఈ రోజు) నుంచి e-SR 2.0ను ప్రారంభించారు. ఆగస్టు 5 వరకూ ఇక్కడ ఉద్యోగుల డేటా నమోదు, స్కాన్ చేసిన SR అప్లోడ్ చేయనున్నారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకూ చెకర్ ధృవీకరిస్తారు. అంతేకాదు హెచ్ఆర్ మేనేజర్ ఆమోదిస్తారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని కొత్త సర్వీస్ ఈవెంట్లు తప్పనిసరిగా e-SRలోనే నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. రెండో దశలో మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో దీన్ని అమలు చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి మిగిలిన ఆఫీసుల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆగస్టు 15 వరకూ డేటా నమోదు, ఆగస్టు 5 నుంచి 31 వరకూ ధృవీకరణ, ఆమోదం తెలపనున్నారు. అనంతరం సెప్టెంబర్ 1 నుంచి e-SR ద్వారా సేవా అంశాల నమోదు తప్పనిసరి చేయనున్నారు.

Next Story