నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఆమోదించుకోవాలని ప్రభుత్వ వ్యూహం

by I. Sairam |

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో కొన్ని కీలక బిల్లులు ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఆమోదించుకోవాలని ప్రభుత్వ వ్యూహం
X

దిశ, నేషనల్ బ్యూరో : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలు, అయోధ్య రామ మందర విరాళాల వివాదం, పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి. అయితే ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహాం రచిస్తోంది. అలాగే మరో కొత్త 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఆదాయపు పన్ను (సవరణ) బిల్లు, 2026, సుప్రీం కోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026, జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2026, జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే (సవరణ) బిల్లు, 2026, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026లు ఉండే అవకాశం ఉంది.

Next Story