ప్రభుత్వ బోర్లను స్వలాభం కోసం వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి..

by Kodari Anjali |

బోర్లను స్వలాభం కోసం వినియోగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు సోమవారం గ్రామ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదేవికి వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వ బోర్లను స్వలాభం కోసం వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి..
X

దిశ, ఊట్కూర్: మండల పరిధిలోని ఓబులాపూర్ గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్లను స్వలాభం కోసం వినియోగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు సోమవారం గ్రామ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదేవికి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని అప్పటి ఎమ్మెల్యేలు కే. దయాకర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిధులతో బోర్లను ఏర్పాటు చేయించారు. అయితే గత ఆరు నెలలుగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ బోర్లను అక్రమంగా తమ ఇళ్లకు, వ్యవసాయ పొలాలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. బోరు నుంచి వాటర్ ట్యాంక్‌కు అనుసంధానంగా ఉన్న పైపులను కూడా ధ్వంసం చేశారని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్న వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్న వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని..ధ్వంసమైన పైపుల స్థానంలో కొత్త పైపులు ఏర్పాటు చేసి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో గ్రామస్తులందరూ కలిసి కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదాసి కుర్వ సంఘం తాలూకా అధ్యక్షుడు అంజప్ప, మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్, భీమ్సేన్, వెంకటస్వామి గౌడ్, కావలి అశోక్, శంకరప్ప, వెంకటప్ప, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story