- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12 ఏళ్ల బాలికపై దాడి, 40-50 మందికి గాయాలు.. సోషల్ మీడియా పుకార్లపై ఢిల్లీ పోలీస్ కీలక ప్రకటన
12 ఏళ్ల బాలికపై దాడి వార్తలను ఖండించిన ఢిల్లీ పోలీసులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు అవాస్తవమని స్పష్టీకరణ!

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో చలో సంసద్ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో గత కొన్ని గంటలుగా ప్రచారమవుతున్న ఒక ఉద్రిక్త పూరిత కథనంపై ఢిల్లీ పోలీసులు (Delhi Police) అధికారికంగా స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 'గీతాంజలి' అనే 12 ఏళ్ల చిన్నారిపై దాడి జరిగిందని, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడంతో తలకు తీవ్ర గాయమైందని, అలాగే మరో 40 నుంచి 50 మంది ప్రదర్శనకారులకు తలలు పగిలాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను పోలీసులు తీవ్రంగా ఖండించారు.
ఈ అంశంపై ఢిల్లీ పోలీస్ అధికారిక ప్రతినిధి స్పందిస్తూ.. "సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చలామణి అవుతున్న ఈ సమాచారం పూర్తిగా తప్పు, అవాస్తవం. గీతాంజలి అనే బాలికపై దాడి జరిగిందని కానీ, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్న వార్తల్లో ఎలాంటి సత్యం లేదు. ప్రజలను భయాందోళనలకు గురిచేయడానికి, శాంతిభద్రతల సమస్యను సృష్టించడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు" అని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పౌరులు ఇలాంటి ధృవీకరించని పుకార్లను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. నకిలీ వార్తలను సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఘోర ప్రమాదం: టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి
- Tags
- Delhi Police






