బినామీ పేరుతో వీఆర్ఏ విధులా?.. సమగ్ర విచారణ చేపట్టాలి

by Ratna Kumari |

మండల తహసీల్దార్ కార్యాలయంలో బినామీ పేరుతో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ రెండు గ్రామ పంచాయతీలకు చెందిన రైతులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

బినామీ పేరుతో వీఆర్ఏ విధులా?.. సమగ్ర విచారణ చేపట్టాలి
X

దిశ, కారేపల్లి : మండల తహసీల్దార్ కార్యాలయంలో బినామీ పేరుతో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ కల్లోజి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని మల్లయ్యగూడెం గ్రామంతో పాటు రెండు గ్రామ పంచాయతీలకు చెందిన రైతులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో రైతులు పేర్కొన్న వివరాల ప్రకారం.. రెవెన్యూ సంబంధిత పనుల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ కృష్ణయ్యను కోరారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు నిరసన చేపట్టి నినాదాలు చేశారు. ఫిర్యాదు వచ్చిన తర్వాతే అధికారులు స్పందించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు విచారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాలోత్ కిషోర్, గుజ్జర్లపూడి సైదులు, పాటి రమేష్, పాటి రంగయ్య, మాలోత్ స్వామి, పోతుల సత్యమయ్య, పోతుల వెంకటేశ్వర్లు, బానోత్ భాషూ, కొండం వెంకటేశ్వర్లు, పాటి రామయ్య తదితర రైతులు పాల్గొన్నారు.

Next Story