ప్రభుత్వ ఆస్పత్రి పనుల పై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమీక్ష

by Batti.Sumithra |

ఆమనగల్లులో రూ.17.50 కోట్లతో నిర్మిస్తున్న 50 పడకల ఆధునిక ప్రభుత్వ ఆస్పత్రి పనుల పై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ ఆస్పత్రి పనుల పై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమీక్ష
X

దిశ, ఆమనగల్లు : ఆమనగల్లులో రూ.17.50 కోట్లతో నిర్మిస్తున్న 50 పడకల ఆధునిక ప్రభుత్వ ఆస్పత్రి పనుల పై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నివాసంలో సోమవారం జరిగిన ఈ సమావేశానికి ఈఈ, డీఈ, సూపరింటెండెంట్ తో కలిసి ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి సంబంధిత అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా ఆస్పత్రి నిర్మాణ పురోగతి, నాణ్యత ప్రమాణాలు, వివిధ విభాగాల ఏర్పాట్లు, పనుల వేగం పై ఈఈ, డీఈ, సూపరింటెండెంట్ లతో కలిసి ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు. ఆమనగల్లు పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నిర్మాణ పనులను నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల ఆరోగ్య అవసరాలకు ఈ ఆస్పత్రి అత్యంత కీలకమైనదని, నిర్ణీత గడువులోపు పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వైద్య పరికరాలు, లిఫ్టు ఏర్పాటు, మార్చూరి ఏర్పాటుతో పాటు పలు ఆదేశాలు జారీ చేసి ఆసుపత్రి ఆవరణను ముందున్న రోడ్డు కన్నా ఎత్తుగా నిర్మించాలని సీహెచ్సీ భవనం వినియోగంలోకి తేవడానికి అసంపూర్తి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, టైల్స్ ను నాణ్యతతో వేసి ఆసుపత్రి భవనాన్ని అప్పగించాలని గుత్తేదారుని ఆదేశించారు. అదే విధంగా సీహెచ్సీకి కావాల్సిన సిబ్బంది క్యాడర్ గురించి మంత్రి దామోదర రాజ నర్సింహా దగ్గరికి సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సీహెచ్సీ ఇన్చార్జి శంకర్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మెకానిక్ బాబా, ఫరీద్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Next Story