- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జంతర్ మంతర్ కు అఖిలేష్ యాదవ్.. CJP 'ఛలో సంసద్ యాత్ర'కు మద్దతు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేసి, ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రముఖ సామాజిక విప్లవకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) దీక్షను పోలీసులు భగ్నం చేసి, ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా దేశవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ ఉద్యమానికి సంఘీభావంగా.. అలాగే దేశంలో ఇటీవల జరిగిన పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) 'ఛలో సంసద్ యాత్ర' పేరుతో నేడు పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తుండటంతో, ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు.
ఈ నిరసనలకు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ (SP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ ఉద్యమానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. సోమవారం ఆయన స్వయంగా జంతర్ మంతర్ వద్దకు చేరుకుని సోనమ్ వాంగ్‌చుక్‌కు సంఘీభావం తెలపడంతో పాటు, పార్లమెంటు ముట్టడి ఉమ్మడి ఆందోళనల్లో పాల్గొంటారని సమాచారం. ఈ మేరకు అఖిలేష్ యాదవ్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఎలాంటి అడ్డంకులు సృష్టించినా, ఏం జరిగినా సరే తాను జంతర్ మంతర్ వద్దకు చేరుకుని నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తానని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ, విద్యార్థి సంఘాలే కాకుండా దేశంలోని పలువురు ప్రముఖ క్రీడాకారులు, సినీ నటులు, సోషల్ మీడియా సెలబ్రెటీలు సైతం సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా సామాజిక మాధ్యమాల వేదికగా గళం విప్పుతున్నారు. నిరసనల నేపథ్యంలో పార్లమెంటు పరిసర ప్రాంతాలు, జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.






