- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో ట్విస్ట్.. వెలుగులోకి సూసైడ్ నోట్
హైదరాబాద్ లో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని అకాడమీ విచారణలో తేలడంతో ఆయన్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఉదయ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. తన సూసైడ్ కు నలుగురు వ్యక్తులు కారణమని లేఖలో రాసినట్లుగా సమాచారం. తన తోటి బ్యాచ్ మేట్ తో ఏడాదికాలంగా రిలేషన్ లో ఉన్నానని, ఆమెకు పెళ్లి తర్వాత కూడా ఆ రిలేషన్ ను కంటిన్యూ చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ తనంతట తానే తన రూమ్ కు వచ్చిందని, అందుకు సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ లో రాసుకొచ్చారు. ఇవే విషయాలను ట్రైనీ ఐపీఎస్ భర్తకు కూడా చెప్పానని, ఆ ఆధారాలన్నీ తన మొబైల్ లో ఉన్నాయని ఉదయ్ పేర్కొన్నారు.
కాగా.. సూసైడ్ అటెంప్ట్ కు ముందు తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పోస్ట్ చేశారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, ఫిర్యాదులు పూర్తిగా అవాస్తవమని, తనకు చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుందని ఆ స్టోరీలో రాసుకొచ్చారు. కాగా.. ఆయన శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతుందన్నారు.






