- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టూరిస్ట్ బస్సును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్.. డ్రైవర్ మృతి
ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్ రోడ్డులో, ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్ రోడ్డులో, ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్‌రూట్‌లో వచ్చిన డీసీఎం వ్యాన్ ఎదురుగా హైదరాబాద్ వైపు వెళ్తున్న టూరిస్ట్ బస్సును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు డీసీఎం వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. టూరిస్ట్ బస్సు ముందు భాగం కూడా నుజ్జునుజ్జయింది. డీసీఎంలో డ్రైవర్‌తో పాటు మరో పదిమంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వారంతా స్వల్ప గాయాలతో బయట పడినట్లు తెలిసింది.
ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో మరింత ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మృతుని వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.






