- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. పాఠశాల ముందు నిల్వ నీటిని తొలగించిన గ్రామపంచాయతీ
by Batti.Sumithra |
రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు భారీ వర్షాలతో నిల్వ ఉన్న నీటి కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై దిశలో వార్త ప్రచురితమైన అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్ వెంటనే స్పందించారు.

X
దిశ, రెబ్బెన : రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు భారీ వర్షాలతో నిల్వ ఉన్న నీటి కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై దిశలో వార్త ప్రచురితమైన అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్ వెంటనే స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి పాఠశాల ముందు నిల్వ ఉన్న వర్షపు నీటిని డ్రైనేజీలోకి మళ్లించి తొలగించారు. దీంతో విద్యార్థుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు. దిశలో ప్రచురితమైన వార్తతో సమస్య గ్రామ పంచాయతీ దృష్టికి వెళ్లి వెంటనే చర్యలు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్, పంచాయతీ సిబ్బందికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






