కోరుట్లలో మళ్లీ చోరీ కలకలం.. బైక్‌లో ఉంచిన రూ.1 లక్ష మాయం

by Kodari Anjali |

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మరోసారి చోరీ ఘటన చోటుచేసుకోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

కోరుట్లలో మళ్లీ చోరీ కలకలం.. బైక్‌లో ఉంచిన రూ.1 లక్ష మాయం
X

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మరోసారి చోరీ ఘటన చోటుచేసుకోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని ద్విచక్ర వాహనంలో ఉంచిన రూ.1 లక్షను గుర్తు తెలియని దుండగులు అపహరించి పరారయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన రాజం కోరుట్ల పట్టణంలోని యూనియన్ బ్యాంక్‌లో రూ.1 లక్ష నగదు డ్రా చేశారు. అనంతరం ఆ నగదును తన స్కూటీలో ఉంచి కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో టీ తాగేందుకు వెళ్లారు. ఈ అవకాశాన్ని గమనించిన దుండగులు స్కూటీలో ఉన్న నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. కాగా, ఇదే నెల 17వ తేదీన కూడా కోరుట్లలో ఓ వృద్ధురాలికి పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించి ఆమె మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. వరుసగా జరుగుతున్న ఈ తరహా చోరీలతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బ్యాంకుల పరిసరాల్లో నిఘా పెంచాలని, పోలీసు గస్తీని మరింత బలోపేతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై కోరుట్ల ఎస్సై చిరంజీవిని ఫోన్ ద్వారా సంప్రదించగా స్పందన లభించలేదు.

Next Story