సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి

by Kodari Anjali |

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో మంగళవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది.

సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి
X

దిశ, బేగంపేట: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో మంగళవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. సాయంత్రం ఈ జరిగిన ఈ పూజా కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజల చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి, మాజీ కార్పొరేటర్లు చీర సుచిత్ర, కొంతం దీపక తదితరులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈవో మనోహర్రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు. చేశారు.

Next Story