- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారిశుద్ధ్య నిర్వహణ పై సమగ్ర ప్రణాళికతో పనులు చేపట్టండి: కమిషనర్
పారిశుద్ధ్య నిర్వహణపై సమగ్ర ప్రణాళికతో పనులను చేపట్టాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

దిశ, కాప్రా: పారిశుద్ధ్య నిర్వహణపై సమగ్ర ప్రణాళికతో పనులను చేపట్టాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ డివిజన్ నాగార్జున నగర్ కాలనీలో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారుల బృందంతో కలిసి ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పలు వీధుల్లో పర్యటించిన ఆయన పారిశుద్ధ్య పనులను, అంతర్గత రోడ్లను, రోడ్లపై అక్రమ నిర్మాణాలు, ర్యాంపులను పరిశీలించారు. అలాగే అస్తవ్యస్తంగా ఉన్న ఇంటి నిర్మాణాల పారబోత, ఖాళీ ప్లాట్లలో చెత్తాచెదారం, తదితర సమస్యలను గమనించారు. అలాగే పర్యావరణ పరిరక్షణ పచ్చదనంపై కాలనీలో నిర్లక్ష్యాన్ని పర్యవేక్షించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ... కాలనీలో పారిశుద్ధ్య పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సానిటరీ సూపర్వైజర్లు, సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ ఎఫ్ ఏ) సమన్వయంతో వ్యవహరించి పారిశుద్ధ్య పనులను సమగ్రంగా చేపట్టాలన్నారు. అలాగే ఇంటి నిర్మాణ వ్యర్ధాలను ఎప్పటికప్పుడు సక్రమంగా తొలగించేలా అధికారులు యజమానులతో కలసి చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపైకి వచ్చిన అక్రమ ఆక్రమణలు, ర్యాంపులను తొలగించి రహదారులను రాకపోకలకు అణువుగా ఉంచాలన్నారు. ఇక నివాసాల బయట ఉండే పూల కుండీలలో హార్టికల్చర్ విభాగం అధికార సిబ్బంది మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ఓపెన్ ప్లాట్లలో చెత్తాచెదారం వేయకుండా ప్లాట్ల యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండిపోయిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.
ట్రేడ్ లైసెన్సులు, ప్రైవేటు
ట్రేడ్ లైసెన్సులు , ప్రైవేటు హాస్టల్లో అనుమతులపై తనిఖీలు అదేవిధంగా అన్ని వాణిజ్య సంస్థలు ట్రేడ్ లైసెన్సులు, ప్రైవేటు హాస్టల్లో అనుమతుల పై తనిఖీలు చేపడతామని తెలిపారు. ప్రతి వాణిజ్య సంస్థలు ట్రేడ్ లైసెన్సులను స్పష్టంగా ప్రదర్శించాలని, హాస్టళ్లు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్‌తో పాటు సంబంధిత అన్ని చట్టబద్ధ అనుమతులు, రికార్డులను నిర్వహించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్రసాగర్, టౌన్ ప్లాన్ , ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, జలమండలి విభాగం అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.






