- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాటర్ హీటర్ షాక్‌తో మహిళ మృతి
by Taduka Kalyani |
మండల కేంద్రంలో వాటర్ హీటర్ ఉపయోగిస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, గట్టు : మండల కేంద్రంలో వాటర్ హీటర్ ఉపయోగిస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని గట్టు ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం, గట్టు గ్రామానికి చెందిన రేణుక (24) మంగళవారం తన నివాసంలో నీటిని వేడి చేసేందుకు వాటర్ హీటర్‌ను ఉపయోగించింది. అనంతరం హీటర్‌ను నీటి నుంచి బయటకు తీసే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో ఆమె అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను గట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి భర్త రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్తతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Next Story






