- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరోయిన్ దగ్గర డబ్బులు వసూలు చేసిన కిరణ్ అబ్బవరం !
ఓ హీరోయిన్ దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు కిరణ్ అబ్బవరం గురించి ఓ వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ కుర్ర హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. మిడిల్ క్లాస్ అభిమానులను ఆకట్టుకునే విధంగా సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నై లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అబ్బవరం. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా చేస్తుండగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా మెరమన్నారు. ఎస్ కే ఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై 24వ తేదీన మూవీ రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో చిత్ర బృందం ఫుల్ బిజీగా మారింది. ఈ సందర్భంగా హీరోయిన్ ను కిరణ్ అబ్బవరం డబ్బులు అడిగినట్లు ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ వెల్లడించారు. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె... ఉదయాన్నే లేచి కిరణ్ అబ్బవరంకు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించబోయానని తెలిపింది.
కానీ మిస్టేక్ లో క్యాబ్ డ్రైవర్ కు సెండ్ చేసినట్లు తెలిపింది. ఆ డ్రైవర్ పేరు కిరణ్ కుమార్ అని ఉండడంతో ఈ తప్పు జరిగినట్లు వెల్లడించింది. అయితే ఆ తర్వాత డ్రైవర్ కు మెసేజ్ చేసి.. డబ్బులు వచ్చేలా చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరానికి పంపినట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో హీరోయిన్ దగ్గర కిరణ్ అబ్బవరం డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు.






