హస్తినలో హైటెన్షన్ వాతావరణం.. ప్రధాని నివాసం ఎదుట బైఠాయించిన కాంగ్రెస్ నేతలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-21 10:47:45  IST  )

విద్యార్థుల ఆందోళనలు, పరీక్షల అక్రమాలపై మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.

హస్తినలో హైటెన్షన్ వాతావరణం.. ప్రధాని నివాసం ఎదుట బైఠాయించిన కాంగ్రెస్ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఇటీవల చోటుచేసుకున్న విద్యార్థుల నిరసనలు, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, తీవ్ర అవకతవకలకు నిరసనగా కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్ర నేతలు తీవ్ర స్థాయిలో నిరసనకు దిగారు. ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధికారిక నివాసం వైపు కాంగ్రెస్ నేతలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అయితే, ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు ప్రధాని నివాసం ఎదుటే రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మోదీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని నివాస ప్రాంతం అంతా.. ‘తానాషాహీ నహీ చలేగీ’, ‘మోదీ ఇస్తీఫా దో’ అనే నినాదాలతో హోరెత్తుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని, పరీక్షల నిర్వహణలో వరుసగా జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

కర్ణాటక మాజీ సీఎం జోరు..

అయితే, ప్రధాన మోడీ నివాసం ముట్టడి కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) నిలిచారు. ఆయన పలువురు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నేతలు, ఎంపీలు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరై వారిలో ఉత్సాహం నింపుతూ సంఘీభావం తెలిపారు. ప్రధాని నివాస పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Next Story