- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిలుకూరులో ఘనంగా వరుణ జపం
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయం వద్ద ఘనంగా వరుణ జపం నిర్వహించారు.

దిశ, మొయినాబాద్ : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయం వద్ద ఘనంగా వరుణ జపం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సీ.ఎస్. రంగరాజన్, లక్ష్మీనరసింహన్ ల నేతృత్వంలో వేద భవనానికి చెందిన ప్రముఖ వేద పండితులు డాక్టర్ వి. శ్రీరామ ఘనపాటి నాయకత్వంలో ఋత్వికులు ప్రవాహంలో నడుము లోతు నీటిలో నిలబడి తైత్తిరీయ సంహితలోని వరుణ జపమంత్రాలను 108 సార్లు పారాయణం చేస్తూ లోకకల్యాణం, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సి.ఎస్.రంగరాజన్ మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడే సకల జీవరాశికి మేలు జరుగుతుందని, శ్రీ చిలుకూరు బాలాజీ అనుగ్రహంతో వరుణ దేవుడు, ఇంద్ర దేవుడు కరుణించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవాలని ప్రార్థించామని తెలిపారు. ఎండిపోతున్న పంటలు పునరుజ్జీవం పొంది రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గతంలోనూ ఇలాంటి సందర్భాల్లో వరుణ జపాలు నిర్వహించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.






