ప్రయాణికుల ప్రాణ రక్షణ మన కర్తవ్యం : డిపో మేనేజర్

by Taduka Kalyani |

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల ప్రాణ రక్షణే ప్రధాన బాధ్యత అని, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యమని నారాయణపేట డిపో మేనేజర్ ఆర్. రామ్మోహన్ అన్నారు.

ప్రయాణికుల ప్రాణ రక్షణ మన కర్తవ్యం :  డిపో మేనేజర్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల ప్రాణ రక్షణే ప్రధాన బాధ్యత అని, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యమని నారాయణపేట డిపో మేనేజర్ ఆర్. రామ్మోహన్ అన్నారు. మంగళవారం నారాయణపేట ఆర్టీసీ డిపో సమావేశ మందిరంలో ప్రైవేట్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు భద్రత, భరోసా కల్పిస్తూ సురక్షిత ప్రయాణం అందించడంలో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. డ్రైవర్లు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ప్రయాణ నియమాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అప్పుడే ప్రయాణికులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా వారి గమ్యాలకు చేర్చగలమని తెలిపారు. ప్రయాణికులు ఎక్కడ బస్సును ఆపినా వారిని గౌరవంగా బస్సులోకి ఎక్కించుకోవాలని, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ప్రైవేట్ డ్రైవర్లకు సూచించారు. వైద్యుడు తన వృత్తిలో చేతులతో సేవలు అందిస్తాడని, అదే విధంగా డ్రైవర్ బాధ్యత మరింత ప్రత్యేకమైనదని అన్నారు. డ్రైవర్ కాళ్లు, చేతులు, దృష్టి, మానసిక స్థితి సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చగలమని పేర్కొన్నారు. కాబట్టి ప్రతి డ్రైవర్ ప్రయాణికుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఆర్టీసీ ప్రతిష్టను పెంచే విధంగా సేవలు అందించాలని రామ్మోహన్ కోరారు.

Next Story