వర్షాల కోసం సంగారెడ్డిలో ప్రత్యేక ప్రార్థనలు

by Taduka Kalyani |

జిల్లాలో వర్షాలు సరిగా కురవక రైతులు, మూగజీవాలు, ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వర్షాలు కురవాలని ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

వర్షాల కోసం సంగారెడ్డిలో ప్రత్యేక ప్రార్థనలు
X

దిశ,సంగారెడ్డి అర్బన్: జిల్లాలో వర్షాలు సరిగా కురవక రైతులు, మూగజీవాలు, ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వర్షాలు కురవాలని ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం సంగారెడ్డి లో స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ షఫీ హఫీజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మత పెద్ద హఫీజ్ ఖారీ అబుల్ రజాక్ నేతృత్వంలో మత పెద్దలు కలిసి సామూహికంగా నమాజ్ చేసి వర్షాలు పడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్‌ను వేడుకున్నారు. వర్షాలు లేక పంటలుఎండిపోతున్నాయని, చెరువులు, కుంటలు ఎండిపోయి మూగజీవాలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. దైవ ప్రార్థనలతో వర్షాలు కురిసి జిల్లాలోని ప్రజల, రైతుల, మూగజీవాల కష్టాలు తీరాలని ఆకాంక్షించారు. ఈ ప్రార్థనల కార్యక్రమంలో మత పెద్దలు తాహిర్ అన్సారి, హఫీజ్ అక్రమ్, స్థానిక కౌన్సిలర్లు నవాజ్, అన్వర్, ఆమీర్, ఖాజా,గౌస్, జుబేర్, మోయిజ్, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story