- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై కోస్టల్ రోడ్‌పై ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన ఖరీదైన ‘పోర్షే’ కారు!
ముంబైలోని కోస్టల్ రోడ్‌పై ఆదివారం ఉదయం ఓ ఖరీదైన పోర్షే (Porsche) కారు హల్ చల్ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబైలోని కోస్టల్ రోడ్‌పై ఆదివారం ఉదయం ఓ ఖరీదైన పోర్షే (Porsche) కారు హల్ చల్ చేసింది. అతివేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో నేరుగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. అయితే, సరైన సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, రోడ్డుపై ఉన్న కారును పక్కకు తొలగించారు. కొద్దిసేపు నిలిచిపోయిన ట్రాఫిక్‌ను తిరిగి పునరుద్ధరించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
వారం వ్యవధిలో ఇది రెండో ఘటన..
కోస్టల్ రోడ్‌పై వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. బుధవారం నాడు హాజీ అలీ నుంచి వర్లీ వెళ్లే మార్గంలో టన్నెల్ (సొరంగం) లోపల వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై వాహనాలను వదిలి సమీప ఎగ్జిట్ వైపు పరుగులు తీశారు. అయితే, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కూడా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.






