లాలాగూడ ఎస్‌హెచ్‌వోను మర్యాదపూర్వకంగా కలిసిన అఖిలపక్ష నాయకులు

by Kodari Anjali |

లాలాగూడ పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)గా బాధ్యతలు స్వీకరించిన రవి కిరణ్ ను అడ్డగుట్ట అఖిలపక్ష నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

లాలాగూడ ఎస్‌హెచ్‌వోను మర్యాదపూర్వకంగా కలిసిన అఖిలపక్ష నాయకులు
X

దిశ, సికింద్రాబాద్: లాలాగూడ పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)గా బాధ్యతలు స్వీకరించిన రవి కిరణ్ ను అడ్డగుట్ట అఖిలపక్ష నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అడ్డగుట్ట డివిజన్‌లో సుమారు 70 శాతం ప్రాంతం లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉందని నాయకులు వివరించారు. ముఖ్యంగా ఆర్‌ఆర్‌సీ స్పోర్ట్స్ గ్రౌండ్, పహాడీ హనుమాన్ ఆలయం పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉండటంతో రాత్రి వేళల్లో ప్రత్యేక పోలీసు గస్తీ నిర్వహించాలని కోరారు. అలాగే ఆషాఢ మాసం మహంకాళి బోనాల సందర్భంగా పోతరాజుల ఊరేగింపులు, భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్‌హెచ్‌వోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వి. నర్సింగ్ రావు, ఎ. వీరేశం, కాంగ్రెస్ నాయకులు హరి, బిఆర్ఎస్ నాయకులు గడ్డం మల్లేష్, సీపీఐ సికింద్రాబాద్ కార్యదర్శి కె. శ్రీనివాస్, సీపీఎం సికింద్రాబాద్ కార్యదర్శి ఆర్. మల్లేష్, రామ్‌చందర్తో పాటు మహిళా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story