- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి జిల్లాలో ఎల్‍నినో కమాండ్ కంట్రోల్ రూమ్స్: మంత్రి శ్రీధర్ బాబు
సాగునీటి విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవని, ఎన్డీఎస్ఏ చెబితే తప్పకుండా మేడిగడ్డ, కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతి జిల్లాలో ఎన్‍నినో సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తాజా పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళిక అమలు చేస్తామన్నారు. సాగునీటి విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవని, ఎన్డీఎస్ఏ చెబితే తప్పకుండా మేడిగడ్డ, కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తామన్నారు. ఒక్కరోజు లక్ష క్యూసెక్కులు రాగానే విపక్ష నేతలు గోల చేశారని ప్రస్తుతం గోదావరిలో 16వేల క్యూసెక్కుల వరద కూడా లేదన్నారు. ఎన్‍నినో పరిస్థితులపై కరీంనగర్ కలెక్టరేట్‍లో ఇవాళ మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల బృందం సమీక్షించారు. వివిధ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు.. భూగర్భ జలాల పరిరక్షణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించామన్నారు. ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించామన్నారు.
మీరు అధికారంలో ఉండగా ఎవరు అడ్డుకున్నారు:
కేటీఆర్ యువతను పక్కదారిపట్టేంచే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ గ్రూప్-1 పరీక్షలు సరిగా నిర్వహించలేదని విమర్శించారు. పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా బీఆర్ఎస్‍ను ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో 56 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని.. జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు.






