- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ 2027 మినీ వేలం డేట్ ఫిక్స్..ఈ సారి కూడా!
ఐపీఎల్ 2027 మినీ వేలం డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్ జరుగుతున్న తరుణంలో ఐపీఎల్ 2027 గురించి బిగ్ అప్డేట్ వచ్చింది. నవంబర్ మాసంలో మినీ వేలం నిర్వహించేలా బీసీసీఐ ప్రణాళికలు చేపట్టింది. నవంబర్ 2 లేదా 3వ వారంలో ఐపీఎల్ 2027 మినీ వేలం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి కూడా దుబాయ్ వేదికగానే ఈ వేలం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా బ్రాండ్ మరింత పెంచేందుకుగాను దుబాయ్ లో నిర్వహించేలా రంగం సిద్ధం చేస్తున్నారట.
ఇక మినీ వేలం నేపథ్యంలో ట్రేడింగ్, రిటెన్షన్ ప్లేయర్లు ఎంపికపై ఈ వారం ఫ్రాంచైజీలు బిజీబిజీగా గడపనున్నట్లు సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా లక్నో మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ ను ఇప్పటికే ఢిల్లీ ట్రేడ్ చేసుకుంది. అలాగే హార్దిక్ పాండ్యాను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే వేలంలోకి వస్తాడు. అటు వచ్చే ఐపీఎల్ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. వన్డే వరల్డ్ కప్ 2027 కోసం ఇప్పటి నుంచే ఆస్ట్రేలియా ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. అందుకే ఐపీఎల్ 2027 టోర్నమెంటును స్కిప్ చేయాలని అనుకుంటున్నారట.






