- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishakha Metro Rail : 6 నెలల్లో విశాఖ మెట్రో పనులు ప్రారంభిస్తాం : ప్రణవ్ గోపాల్
విశాఖపట్నంలో మెట్రో రైలు(Vishakha Metro Rail) ప్రాజెక్టు పనులు ఆరు నెలల్లో ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ సహాయ మంత్రి ప్రణవ్ గోపాల్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలో మెట్రో రైలు(Vishakha Metro Rail) ప్రాజెక్టు పనులు ఆరు నెలల్లో ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ సహాయ మంత్రి ప్రణవ్ గోపాల్ ప్రకటించారు.ఈ ప్రాజెక్టు తొలి దశలో 46.23 కి.మీ. మేర మూడు కారిడార్లలో, 42 స్టేషన్లతో, రూ.11,498 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది కూడలి వరకు (34.4 కి.మీ.), గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు (5.07 కి.మీ.), తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75 కి.మీ.) పనులు చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ ఇది వరకే అసెంబ్లీలో వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు మొదలవుతాయని మంత్రి ప్రణవ్ తెలిపారు. రూ.6,100 కోట్ల రుణం కోసం AIIB, ADB వంటి విదేశీ బ్యాంకులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. భూసేకరణకు రూ.882 కోట్లతో సహా మొత్తం నిధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20% భరిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 16,000 మంది ప్రయాణికుల రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించి, విశాఖ నగర అభివృద్ధికి దోహదపడే ఈ ప్రాజెక్టు కోసం మే నెలాఖరు వరకు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించారు.






