వర్షానికి కూలిన ఇంటి పైకప్పు.

by Ratna Kumari |   (  Updated:2026-07-21 08:47:40  IST  )

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని తోర్తి గ్రామానికి చెందిన మాడవేడి అనసూయ అనే ఒంటరి మహిళ నివసిస్తున్న ఇంటి పైకప్పు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది.

వర్షానికి కూలిన ఇంటి పైకప్పు.
X

దిశ, మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని తోర్తి గ్రామానికి చెందిన మాడవేడి అనసూయ అనే ఒంటరి మహిళ నివసిస్తున్న ఇంటి పైకప్పు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. ఘటన సమయంలో ఆమె అప్రమత్తంగా ఇంటి నుంచి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోవడంతో ఆమె నివాసానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఒంటరిగా జీవనం సాగిస్తున్న తనకు సొంతంగా ఇంటిని పునర్నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించి ఇంటి నిర్మాణానికి చేయూతనివ్వాలని బాధితురాలు కన్నీటి పర్యంతమై విజ్ఞప్తి చేశారు. గ్రామస్థులు కూడా స్పందించి బాధితురాలికి ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Next Story