రైతులకు న్యాయం చేయండి : ఎమ్మెల్సీ అంజిరెడ్డి

by Batti.Sumithra |

జిన్నారంలోని సర్వే నంబర్ ఒకటి భూములను హెచ్ఎండీఏకి కాకుండా వెంటనే టీజీ ఐఐసీకి ఇవ్వాలని కోరుతూ జిన్నారం రైతులు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించారు.

రైతులకు న్యాయం చేయండి : ఎమ్మెల్సీ అంజిరెడ్డి
X

దిశ, జిన్నారం : జిన్నారంలోని సర్వే నంబర్ ఒకటి భూములను హెచ్ఎండీఏకి కాకుండా వెంటనే టీజీ ఐఐసీకి ఇవ్వాలని కోరుతూ జిన్నారం రైతులు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ని కలిసి కోరారు. హెచ్ఎండీఏకి కేటాయిస్తే ఇంతవరకు రైతులకు ఆరు వందల గజాల స్థలం ఇవ్వలేదని, నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా రైతులకు న్యాయం జరగలేదని కలక్టర్ కి తెలిపారు. టీజీ ఐఐసీకి కేటాయించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రైతులకు ఎకరాకు 60 లక్షలు వంద గజాల స్థలం ఇవ్వాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే రైతులకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ తెలిపారు. ఆయన వెంట బీజేపీ నాయకుడు రాజేందర్ రెడ్డి, రైతులు అశోక్, రాము, నగేష్, పుట్టి బిక్షపతి తదితరులు ఉన్నారు.

Next Story