హైదరాబాద్‌ నగరాన్ని కమ్మేసిన మేఘాలు.. పలు ప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం

by Kema Shiva Kumar |

హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

హైదరాబాద్‌ నగరాన్ని కమ్మేసిన మేఘాలు.. పలు ప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఉదయం వాతావరణం సాధాణంగా ఉన్నా సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాలతో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త రిలీఫ్ కలిగించినప్పటికీ, నిత్యం రద్దీగా ఉండే వేళల్లో వాన పడుతుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బ్యాక్‌ టు బ్యాక్ ట్రాఫిక్..

నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, కృష్ణానగర్, ఫిల్మ్‌నగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. హఠాత్తుగా కురిసిన వర్షానికి ప్రధాన రహదారులపైకి భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా అమీర్‌పేట్ - పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ బ్యాక్‌ టు బ్యాక్ కొనసాగుతోంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు వర్షంలో తడుస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే, రోడ్లపై నీరు నిలవకుండా తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు రంగంలోకి దిగాయి. డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ నీరు సజావుగా వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రధాన సర్కిళ్లలో నిలబడి ట్రాఫిక్‌ను సరిచేస్తున్నారు.

Next Story