- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఉపాధ్యాయులకు అలర్ట్: ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, లోకల్ బాడీ, మోడల్ స్కూల్స్, గురుకులాలు (TGREIS), ఇతర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం 'తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET-In-service Teachers - 2026) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం (జూలై 21, 2026)న విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, లోకల్ బాడీ, మోడల్ స్కూల్స్, గురుకులాలు (TGREIS), ఇతర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం 'తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET-In-service Teachers - 2026) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం (జూలై 21, 2026)న విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ప్రస్తుత పోస్టుల్లో కొనసాగేందుకు లేదా తదుపరి పదోన్నతులు (ప్రమోషన్లు) పొందేందుకు టెట్ అర్హత తప్పనిసరి అని విద్యాశాఖ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది.
జూలై 22 నుంచి 29 ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఆగస్టు 31 హాల్ టిక్కెట్లు విడుదల చేస్తారు. సెప్టెంబర్ 07 నుండి 11 వరకు ఆన్లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9:00 నుండి 11:30 వరకు (సెషన్ 1), మధ్యాహ్నం 2:00 నుండి 4:30 వరకు (సెషన్ 2) పరీక్షలు ఉండనున్నాయి. సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30 మధ్య ఫలితాల విడుదల చేస్తారు. ఈ టెట్ పరీక్షను-2 పేపర్లుగా నిర్వహిస్తారు. పేపర్ - 1ను 1 నుండి 5 తరగతుల బోధకులకు (SGT/LFL హెచ్ఎంలు).. పేపర్ - IIను 6 నుండి 8 తరగతుల బోధకులకు (స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండితులు, టీజీటీలు, హైస్కూల్ హెచ్ఎంలు) నిర్వహిస్తారు. 1 నుండి 5 తరగతులకు బోధిస్తూ, 6 నుండి 8 తరగతులకు అర్హత ఉన్నవారు రెండు పేపర్లు రాయవచ్చని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
పరీక్ష రుసుము:
జనరల్ & బీసీ(BC) అభ్యర్థులకు: ఒక పేపరు (Paper I లేదా Paper II) రూ.750/-, రెండు పేపర్లకు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు (SC/ST/PWD): ఒక పేపర్‌కు రూ. 700/-, రెండు పేపర్లకు రూ.950గా నిర్ణయించారు. జనరల్/EWS: 60% లేదా అంతకంటే ఎక్కువ, బీసీ (BC): 50% లేదా అంతకంటే ఎక్కువ, ఎస్సీ/ ఎస్టీ / దివ్యాంగులు: 40% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధిస్తే అర్హులు అవుతారు.
ముఖ్యమైన గమనిక:
ఈ ప్రత్యేక టెట్‌లో సాధించిన అర్హత కేవలం ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల సర్వీస్ కొనసాగింపు, ప్రమోషన్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. భవిష్యత్తులో జరిగే నేరుగా ఉద్యోగ నియామకాలకు (Direct Recruitment) ఈ సర్టిఫికేట్ చెల్లదని విద్యాశాఖ పేర్కొంది.






