- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IIT Roorkee: రాజకీయ కార్యకలాపాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి
విద్యార్థులు, అధ్యాపకులు సంస్థ ముందస్తు అనుమతి లేకుండా సోషల్ మీడియాలో రాజకీయ కార్యకలాపాలు లేదా రాజకీయ చర్చల్లో పాల్గొనరాదని పేర్కొన్న వైరల్ కావడంతో చర్చకు దారితీసింది.

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనల మధ్య ఐఐటీ రూర్కీ విద్యార్థులకు జారీ చేసిన వార్షిక అడ్వైజరీ వివాదాస్పదంగా మారింది. ఐఐటీ రూర్కీ విద్యార్థులు, అధ్యాపకులు సంస్థ ముందస్తు అనుమతి లేకుండా సోషల్ మీడియాలో రాజకీయ కార్యకలాపాలు లేదా రాజకీయ చర్చల్లో పాల్గొనరాదని పేర్కొన్న ఒక అంతర్గత నోటీసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చకు దారితీసింది. విద్యార్థులు పంచుకున్న స్క్రీన్‌షాట్ ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో కొందరు క్యాంపస్ సభ్యులు ప్రస్తుత రాజకీయ ఉద్యమాలకు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నట్లు గుర్తించామని, సంస్థ ప్రవర్తనా నియమావళి ప్రకారం అలాంటి రాజకీయ ప్రకటనలు లేదా కార్యకలాపాల్లో పాల్గొనాలంటే ముందస్తు అనుమతి అవసరమని నోటీసులో పేర్కొన్నారు. సంస్థ ప్రతిష్ఠకు లేదా ప్రభుత్వంతో ఉన్న సంబంధాలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని కూడా అందులో సూచించారు.
అయితే, ఈ నోటీసు కొత్త ఆదేశం కాదని ఐఐటీ రూర్కీ స్పష్టం చేసింది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి పంపే సాధారణ అంతర్గత సూచనల్లో ఇదీ ఒకటేనని, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రవర్తనా నియమావళిని గుర్తు చేయడానికే ఈ మెయిల్ పంపించామని తెలిపింది. దీన్ని కొత్త విధానంగా లేదా తాజా ఆంక్షగా చూడొద్దని సంస్థ వివరణ ఇచ్చింది.






