- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్వకుర్తిని అగ్రస్థానంలో నిలిపితే రూ.1 లక్ష విరాళం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కల్వకుర్తి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపితే రూ.1 లక్షలను విరాళంగా అందజేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రకటించారు.

దిశ, తలకొండపల్లి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కల్వకుర్తి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపితే రూ.1 లక్షలను విరాళంగా అందజేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో కల్వకుర్తి నియోజకవర్గం అగ్రస్థానంలో కొనసాగుతోందని, వచ్చే నెల 3వ తేదీతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ గడువు ముగిసేలోపు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ మొదటి స్థానాన్ని సాధించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త బీఎల్ఎలను, సూపర్వైజర్ లను ప్రోత్సహిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలనీ ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతం, యజ్ఞ మహోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కసిరెడ్డి, కల్వకుర్తి ఎస్ఐఆర్ ఇంచార్జ్ సంధ్యారెడ్డిలు మాట్లాడుతూ ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని, ఎవ్వరూ మిగిలిపోకుండా నమోదు పూర్తయ్యేలా కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. కల్వకుర్తి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కల్వకుర్తి, ఆమనగల్ బ్లాక్ స్థాయిలో కూడా బహుమతులు అందిస్తాం..
అదేవిధంగా ఆమనగల్, కల్వకుర్తి బ్లాక్‌ల పరిధిలో పనిచేస్తున్న బీఎల్ఎ, సూపర్వైజర్లను గుర్తించి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సూపర్వైజర్లను గుర్తించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులతో పాటు మెమెంటోలు అందజేసి ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గ్రామంలో వందశాతం లక్ష్య సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే చేసిన పిలుపుకు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్వకుర్తిని నంబర్–1 స్థానంలో నిలబెట్టేందుకు సమష్టిగా పనిచేస్తామని నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా సంకల్పం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ గీతా నరసింహ, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కేశవరెడ్డి, బ్లాక్ స్థాయి మహిళా అధ్యక్షురాలు రమాదేవి, సర్పంచులు రామ లక్ష్మణ్, భారతమ్మ గోపాల్,రమేష్, రాజు నాయక్,డీసీసీ ప్రధాన కార్యదర్శి రఘురాములు, నాయకులు భగవాన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శివకుమార్, డేవిడ్, రాజేంద్ర నాయక్, రమేష్ యాదవ్, నరసింహారెడ్డి, కృష్ణ, రేణు రెడ్డి, తిరుపతి, పవన్ వాల్మీకి, వజ్ర లింగం, రఘుపతి రెడ్డి, అంజయ్య గుప్తా, వెంకటరెడ్డి, రాఘవేందర్ యాదవ్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.






