ప్రజల గొంతుకగా పత్రికలు నిలవాలి: ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి

by Kodari Anjali |   (  Updated:2026-07-21 08:47:16  IST  )

మున్నీర్ సేవలను పత్రికా రంగం మర్చిపోదని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు.

ప్రజల గొంతుకగా పత్రికలు నిలవాలి: ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి
X

దిశ, గోదావరిఖని: ప్రజల గొంతుకగా పత్రికలు గెలవాలని, మున్నీర్ సేవలను పత్రికా రంగం ఎప్పటికీ మరిచిపోదనిbప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం గోదావరిఖనిలో ప్రముఖ జర్నలిస్టు, రచయిత, ఉద్యమకారుడు మునీర్‌పై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పత్రికలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత వద్దన్నారు. మునీర్ భాయ్ పత్రికా రంగానికి అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. జర్నలిజం అంటే కేవలం వార్తలను ప్రచురించడం మాత్రమే కాదని, ప్రజల సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం దిశగా ఉండాలన్నారు. మునీర్ భాయ్ ఎన్నో సంవత్సరాలుగా పత్రికా రంగంలో నిబద్ధతతో పనిచేస్తూ సమాజానికి ఉపయోగపడే రచనలు అందించారని, పుస్తక రూపంలో తన అనుభవాలను అందించడం యువ పాత్రికేయులకు మార్గదర్శకంగా నిలుస్తుందని శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు, పాత్రికేయులు, రచయితలు ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ నాయకుడు నగునూరి శేఖర్, అక్షర ఫౌండేషన్ ప్రతినిధి మాదాస రామ్మూర్తి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు వంశీ, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాధవరావు, గడ్డం శ్యాం కుమార్, ఏఐటీయూసీ కేంద్ర కమిటీ నాయకుడు కే స్వామి, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి, హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తోపాటు సీనియర్ జర్నలిస్టులు ప్రజాసంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story