వరద ధాటికి కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు.. నిలిచిపోయిన రాకపోకలు

by Taduka Kalyani |

ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో ఇసుకవాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో మంగళవారం ఉదయం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

వరద ధాటికి కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు.. నిలిచిపోయిన రాకపోకలు
X

దిశ,వెంకటాపురం(నూగూరు ): ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో ఇసుకవాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో మంగళవారం ఉదయం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వంతెన నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనాల రాకపోకలు కొనసాగేందుకు తాత్కాలికంగా డైవర్షన్‌తో పాటు అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేశారు. అయితే సోమవారం వాజేడు, నూగూరు మండలాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇసుకవాగులో వరద ఉధృతి పెరగడంతో అప్రోచ్ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనతో ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే వాహనాలతో పాటు స్థానిక రాకపోకలు కూడా తీవ్రంగా అంతరాయం ఏర్పడ్డాయి. పరిస్థితిని గమనించిన పోలీసులు అప్రమత్తమై, ఆ మార్గంలో వచ్చే వాహనాలను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచిస్తున్నారు. వరద నీరు తగ్గిన తర్వాత అప్రోచ్ రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Next Story