- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ కోసమే భారత జలాల్లోకి చైనా గూఢచర్య నౌక
భారత జలాల్లోకి చైనా గూఢచర్య నౌక వచ్చింది. పాకిస్తాన్‌కు సమాచారం చేరవేసేందుకే ఈ నౌక వచ్చిందని నిపుణులు అంటున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు శాంతించినా.. ఉగ్రవాదంపై మన పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్‌కు ఎల్లవేళలా అండగా ఉంటామని ప్రకటించిన చైనాకు చెందిన గూఢచార నౌక ‘డా యాంగ్ యి హావ్’ భారత జలాల్లోకి రావడం చర్చనీయాంశమైంది. భారత నేవీ నిఘా సామర్ధ్యాన్ని, ప్రతిస్పందన వేగాన్ని పరీక్షించడానికే ఈ నౌక వచ్చి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
అలాగే జలాంతర్గాములు ప్రయాణించే మార్గాలు, సముద్ర గర్భం పరిస్థితులను కూడా ఈ నౌక సాయంతో చైనా అంచనా వేయగలుగుతుంది. ఈ సమాచారం యాంటీ సబ్‌మెరీన్ వార్‌ఫేర్ (ఏఎస్‌డబ్ల్యూ) ప్లానింగ్‌కు చాలా కీలకం. ప్రస్తుతం ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత హైఅలర్ట్‌లో ఉన్న భారత నావికా దళాలను మానిటర్ చేసి, ఐఎన్ఎస్ విక్రాంత్ సహా ఇతర నౌకల సమాచారాన్ని పాక్‌కు పంపడమే చైనా లక్ష్యం అయ్యుండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






