- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అపుడు స్ఫూర్తిగా నిలిచి.. ఇపుడు తోటి ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు
తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా, మానసికంగా వేధించిన ఆరోపణలపై ఏపీకి చెందిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై శనివారం రాత్రి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (NPA) లో ట్రైనీ ఐపీఎస్ అధికారుల మధ్య జరిగిన ఓ ఉదంతం సంచలనంగా మారింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా, మానసికంగా వేధించిన ఆరోపణలపై ఏపీకి చెందిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై శనివారం రాత్రి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ 23 నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలికి వాట్సప్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ, అకాడమీలో స్నేహితుల ముందు అమర్యాదగా మాట్లాడటమే కాకుండా, ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేశాడని ఆరోపణలు నమోదయ్యాయి. తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి, జుట్టు పట్టుకుని లాగి, గొంతు పిసికి, మెడపై కత్తి పెట్టి బెదిరించాడని, ఫోన్ పాస్‌వర్డ్ లాక్కుని వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి, వాటిని తన భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
అప్పట్లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఉదయ్ కృష్ణారెడ్డి
ప్రకాశం జిల్లా ఊళ్లపాలేనికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి, నానమ్మ వద్ద పెరుగుతూ కూరగాయలు అమ్మాడు. 2013లో కానిస్టేబుల్‌గా చేరిన ఆయన, ఒక సీఐ చేసిన అవమానాన్ని తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఐదో ప్రయత్నంలో సివిల్స్‌లో 360వ ర్యాంకు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.
ఇప్పుడు లైంగిక వేధింపులతో అధఃపాతాళానికి
ఇప్పుడు మాత్రం తోటి మహిళా ఐపీఎస్ పై వేధింపులకు పాల్పడిన కేసులో, బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వేధింపుల ఘటన మాత్రమే కాకుండా ఉదయ్ కృష్ణారెడ్డి గతంలోనూ అకాడమీలో వాట్సప్ గ్రూపుల ద్వారా ఇతరులను ఇబ్బంది పెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. శిక్షణ కాలంలోనే ఇటువంటి తీవ్రమైన క్రిమినల్ కేసులో ఇరుక్కోవడంతో ఆయన ఐపీఎస్ హోదాపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది.
- Tags
- Trainee IPS
- NPA






