Income Tax Department: ఆదాయపు పన్ను శాఖలో భారీగా సిబ్బంది కొరత

by S Gopi |

అయితే ఈ ఖాళీలను యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ ద్వారా ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల ద్వారా దశలవారీగా భర్తీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

Income Tax Department: ఆదాయపు పన్ను శాఖలో భారీగా సిబ్బంది కొరత
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆదాయపు పన్ను శాఖలో సిబ్బంది కొరత ఇంకా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి గ్రూప్-ఏ, బి, సి విభాగాల్లో కలిపి 26,997 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో తెలిపారు. అయితే ఈ ఖాళీలను యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ ద్వారా ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల ద్వారా దశలవారీగా భర్తీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పన్ను వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025, సరళమైన నిబంధనలు, ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, డేటా అనలిటిక్స్, డిజిటల్ ట్యాక్స్ ప్రాసెసింగ్ వంటి సంస్కరణలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ టెక్నాలజీ ఆధారంగా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. మరో ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి, ఆర్థిక నేరాలపై చర్యలు కూడా వేగవంతం చేసినట్టు చెప్పారు. 2024 నుంచి ఇప్పటివరకు 11 మందిని 'ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్'గా ప్రకటించగా, వారి రూ.1,303 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం రూ.73,015 కోట్లకు పైగా ఆస్తులను బాధితులు లేదా చట్టబద్ధమైన హక్కుదారులకు తిరిగి అప్పగించినట్లు పేర్కొంది.

Next Story