- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన ఇల్లు - మన లోకేశ్.. 3 వేలమందికి ఇళ్ల పట్టాలు పంపిణీ
మన ఇల్లు - మన లోకేశ్ పేరుతో నిర్వహించిన ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇల్లు - మన లోకేశ్ పేరుతో నిర్వహించిన ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 3 వేలమందికి మంత్రి లోకేశ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. నిరుపేదలకు రూ.1000 కోట్ల విలువైన ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. శాశ్వత భూ పట్టాతో పేదల ఆస్తిని ఎవ్వరూ కదిలించలేరన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో తాను ఓడిపోయినపుడు.. తన తండ్రి చంద్రబాబును కూడా కొందరు అవహేళన చేశారని గుర్తుచేసుకున్న మంత్రి.. ఆ కసితోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నానన్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా మార్చి చూపిస్తానని మంత్రి నారా లోకేశ్ చాలెంజ్ చేశారు. ఇప్పటికే డ్రైనేజీ పనులు చేపట్టామని, త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని వెల్లడించారు.






