చ‌ర్చ‌ల‌కు పిలిచిన‌ మోడీ స‌ర్కార్‌..CJP కీల‌క వ్యాఖ్య‌లు

by velandi.Saikiran |   (  Updated:2026-07-20 19:01:49  IST  )

CJP కార్యకర్తలు సోమవారం రోజున పార్లమెంట్ ముట్టడికి కదం తొక్కిన సంగతి తెలిసిందే.

చ‌ర్చ‌ల‌కు పిలిచిన‌ మోడీ స‌ర్కార్‌..CJP కీల‌క వ్యాఖ్య‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్: CJP కార్యకర్తలు సోమవారం రోజున పార్లమెంట్ ముట్టడికి కదం తొక్కిన సంగతి తెలిసిందే. ధర్మేంద్ర రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఇందులో భాగంగానే పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన వారిలో 70 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఈ సమయంలో లాఠీఛార్జ్‌ జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఈ సంఘటన హట్ టాపిక్ కావడంతో... CJP కార్యకర్తలను చర్చలకు పిలిచింది మోడీ సర్కార్. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి జె.పి. నడ్డాను క‌లిసారు.

ఇక నడ్డాను కలిసిన తర్వాత 'కాక్రోచ్ జనతా పార్టీ' ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యువత ఒత్తిడి కారణంగా 12 ఏళ్లలో మొదటిసారిగా ప్రభుత్వం చర్చల కోసం ప్రజలను పిలిచిందని వివ‌రించారు. త‌మ‌ ఉద్యమానికి, నిరసనకు ఇది ఒక గొప్ప విజయం అని వెల్ల‌డించారు. తాము లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించి త్వరలోనే మాకు సమాధానం ఇస్తామని కేంద్ర మంత్రి జె.పి. నడ్డా హామీ ఇచ్చారన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ప‌ద‌వికి కాలం చెల్లిందని, ఆయన తప్పుకోవాల్సిందేనని హెచ్చ‌రించారు.

Next Story