- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ ఈవెంట్‌కు ఎలా వెళ్లాలో తెలియదా? రకుల్ గ్లామర్ షోపై దారుణమైన ట్రోలింగ్
ఎంతో పవిత్రంగా భావించే ‘రామాయణ’ లాంటి చారిత్రాత్మక సినిమా వేడుకలో మోతాదుకు మించిన గ్లామర్ ప్రదర్శించడం ఏంటని నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.

దిశ, సినిమా: నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇతిహాసగాథ ‘రామాయణ’. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది దీపావళి సందర్భంగా థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్షణుడిగా రవి దూబే, భరతుడిగా ఆదినాథ్ కొఠారే, రావణాసురుడిగా యష్,మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్, కనిపించబోతున్నారు. అంతేకాకుండా ఇందులో రకుల్ ప్రీత్‌సింగ్ కూడా కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ వేడుకలు ఢిల్లీలో ఎంతో వైభవంగా జరిగాయి. మన దేశ సంస్కృతి, హిందూ పురాణాలు, భక్తి భావంతో ముడిపడి ఉన్న ఈ సినిమా వేడుకకు నటీనటులంతా ఎంతో పద్ధతిగా హాజరయ్యారు. ముఖ్యంగా ఇదే సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి సాంప్రదాయబద్ధంగా వచ్చి అందరి ప్రశంసలు అందుకుంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో అత్యంత గ్లామరస్‌గా ఈవెంట్‌కు హాజరైంది.
ఎంతో పవిత్రంగా భావించే ‘రామాయణ’ లాంటి చారిత్రాత్మక సినిమా వేడుకలో మోతాదుకు మించిన గ్లామర్ ప్రదర్శించడం ఏంటని నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. సందర్భాన్ని బట్టి ఎలాంటి దుస్తులు ధరించాలో కనీస అవగాహన ఉండక్కర్లేదా అని సోషల్ మీడియాలో రకుల్‌పై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మొదలైంది. తాజాగా, ఈ విషయంపై రకుల్ ట్రోల్స్‌పై రియాక్ట్ అయ్యారు. తనపై జరుగుతున్నదంతా కేవలం కావాలని చేస్తున్న నెగెటివ్ ప్రచారమని, ఈమధ్య సోషల్ మీడియాలో నెగెటివిటీ బాగా ఎక్కువైపోయిందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. అయితే రకుల్ వివరణపై సినీ ప్రియులు, నెటిజన్లు సంతృప్తి చెందకపోగా మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఈవెంట్‌కు ఎలా వెళ్లాలో, సందర్భానికి తగ్గట్టు ఎలా ప్రవర్తించాలో మర్చిపోయి గ్లామర్ షో చేయడం.. ఆ తర్వాత తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియాను, నెటిజన్లను బ్లేమ్ చేయడం సరికాదని రకుల్‌కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. తప్పును ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయడం వల్ల ఆమెపై నెగెటివిటీ మరింత పెరుగుతోందని కామెంట్లు చేస్తున్నారు.






