- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరిగిన ఫ్లెక్సీలతో కాంగ్రెస్‌లో కలకలం.. మంత్రి పర్యటన ముందే అసమ్మతి రగడ?
మండలంలో మంగళవారం రైతులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు.

దిశ, ములకలపల్లి: మండలంలో మంగళవారం రైతులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మల నాగేశ్వరరావు వస్తుండగా అభిమానులు కార్యకర్తలు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వర్గాల విభేదాలతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల పోరు అందరికి తెలిసిందే. అయితే కార్యక్రమానికి ముందే మంత్రి తుమ్మల పర్యటన సందర్భంగా మండలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చిరిగిపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పలు చోట్ల ఇరువర్గాలకు చెందిన నాయకుల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు దెబ్బతిన్నాయి.
దీంతో ఇది వాతావరణ ప్రభావమా? లేక కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఈ పని చేసిందా? లేదా ఇరు వర్గాల మధ్య విభేదాలను మరింత రాజేసేందుకు ఎవరైనా కావాలనే ఈ చర్యకు పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయాన్నే తుమ్మల అనుచరులు మాత్రం అక్కడకు చేరుకుని చిరిగిన ఫ్లెక్సీల స్థానంలో కొత్త ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు, మరో వర్గానికి సంబంధించిన చిరిగిన ఫ్లెక్సీలు అలాగే ఉండిపోవడం స్థానికంగా మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా ఇలా ఉండగా ఇరు వర్గాల మధ్య విభేదాలను మరింత పెంచేందుకు కావాలనే ఇలా ఎవరైనా చేశారా? అనే చర్చ కూడా కార్యకర్తల్లో సాగుతోంది. అయితే ఫ్లెక్సీలు సహజంగానే చిరిగాయా? లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చింపారా? అనే విషయం పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. దీంతో ఈ ఘటన వెనుక అసలు కారణమేంటన్నది అనుమానాస్పదంగా మారింది.






