ఫిఫా వరల్డ్ కప్ విజేత స్పెయిన్

by Muthe.Rajitha |

న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మహాసంగ్రామంలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గట్టి షాక్ ఇస్తూ స్పెయిన్ జట్టు ప్రపంచ కప్‌ను ముద్దాడింది.

ఫిఫా వరల్డ్ కప్ విజేత స్పెయిన్
X

దిశ, వెబ్ డెస్క్ : న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మహాసంగ్రామంలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గట్టి షాక్ ఇస్తూ స్పెయిన్ జట్టు ప్రపంచ కప్‌ను ముద్దాడింది. నాలుగోసారి ఛాంపియన్‌గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాలనే లియోనెల్ మెస్సీ బృందం ఆశలకు అడ్డుకట్టు వేసిన స్పెయిన్, ఏకంగా 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ఫుట్‌బాల్ విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల రక్షణ శ్రేణులు అత్యంత పటిష్టంగా నిలబడటంతో నిర్ణీత 90 నిమిషాల పూర్తి సమయం ముగిసేసరికి ఇరు జట్లూ ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి, దీనితో మ్యాచ్ 0-0 తో డ్రాగా నిలిచి ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. ఫెర్నాండేజ్ రెడ్ కార్డ్ వల్ల బయటికి వెళ్లినా అర్జెంటీనా కీపర్ మార్టినెజ్ వీరోచితంగా స్పెయిన్ దాడులను అడ్డుకున్నప్పటికీ, ఎక్స్‌ట్రా టైమ్‌లో స్పెయిన్ తన వ్యూహాలకు పదును పెట్టింది. మ్యాచ్ 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్ (Ferran Torres) లభించిన అద్భుత అవకాశాన్ని గోల్‌గా మలచడంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఈ ఏకైక గోల్‌తో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించిన స్పెయిన్ ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ అర్జెంటీనాపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, సరికొత్త ఫుట్‌బాల్ రాజ్యాంగాన్ని లిఖించింది.

Next Story