- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యాభర్తల గొడవ.. భార్య ఆత్మహత్య
సంసార విషయంలో గొడవపడి ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది.

దిశ, నర్సాపూర్ : సంసార విషయంలో గొడవపడి ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చింతల్‌చెరువు గ్రామానికి చెందిన చాకలి పద్మ (38)కు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందిన చాకలి దుర్గయ్యతో 21 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు సంతానం ఉన్నారు. పెళ్లైన తొలి పదేళ్ల వరకు వారి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. అయితే 2018 సంవత్సరంలో చాకలి పద్మ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో కలిసి వెళ్లిపోయింది. అనంతరం 2026 మార్చి నెలలో తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి భార్యాభర్తలు మహమ్మద్‌నగర్‌లో కాకుండా నర్సాపూర్‌లో అద్దె గదిలో నివాసం ఉంటున్నారు. సోమవారం సంసార విషయంలో భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవ జరిగింది. అనంతరం భర్త దుర్గయ్య స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లగా, పద్మ బెడ్‌రూమ్ తలుపుపై ఉన్న వెంటిలేటర్ సీంకులకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు మరణంలో ఎలాంటి అనుమానం లేదని మృతురాలి తల్లి చాకలి సుశీల ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.






